WGL: భారత విద్యార్థి సమైక్య (SFI) జిల్లా అధ్యక్షునిగా నెక్కొండ మండలానికి చెందిన బానోత్ వినోద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఉర్సుగుట్ట వద్ద గల SFI ఆఫీస్లో ఎన్నికలు జరగగా.. జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని వినోద్ కుమార్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యాహక్కుల కోసం పోరాడతానని వినోదకుమార్ తెలిపారు.