AP: పిఠాపురంలో ఈనెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపాలని ఆ పార్టీ నిర్ణయించింది. అయితే తాజాగా ఆ వేడుకల్లో మార్పులు చేసింది. రాష్ట్రస్థాయి వేడుకలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రద్దు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా కార్యక్రమంలో మార్పులు చేశారు. 14న ఉమ్మడి జిల్లా కేంద్రాలు, నగరాలు, మండలాలు, పంచాయతీల్లో వేడుకలు నిర్వహించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.