»Manipur Crisis Air Ticket Prices Rise From Imphal To Kolkata Guwahati
Flight Ticket Price Hike విమాన సంస్థల కక్కుర్తి.. మణిపూర్ కు భారీగా చార్జీలు పెంపు
ప్రధాని మోదీ నిర్లక్ష్యం.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనంతో మణిపూర్ లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పరిస్థితులు సద్దుమణగలేకపోవడంతో అక్కడి వారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
విమానయాన సంస్థలు (Aviation Companies) కక్కుర్తికి అలవాటుపడుతున్నాయి. ఎప్పుడు.. ఎలా అదనపు ఆదాయం (Income) పొందుదామా అనే ఆలోచనలు చేస్తాయి. మానవత్వం అనేది లేకుండా ప్రవర్తిస్తాయి. తాజాగా మణిపూర్ (Manipur)లో నెలకొన్న పరిస్థితులను క్యాష్ (Cash) చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు (Passengers) భారీ షాక్ ఇస్తున్నాయి. ఒక్కసారిగా విమాన చార్జీలను (Flight Tickets) పెంచేశాయి. దీంతో మణిపూర్ ను ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు భారీగా చెల్లించాల్సి వస్తోంది.
ప్రధాని మోదీ నిర్లక్ష్యం.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనంతో మణిపూర్ లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈశాన్య ప్రాంతంలో అల్లర్లు (Riots) రేగి ఏకంగా 60 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. పరిస్థితులు సద్దుమణగలేకపోవడంతో అక్కడి వారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో విమానాలను (Plane) ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా చేసుకుని విమానయాన సంస్థలు భారీగా టికెట్ ధరలు (Ticket Price Hike) పెంచేశాయి. ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. సాధారణంగా ఇంఫాల్ నుంచి కోల్ కత్తా, గౌహతి మధ్య టికెట్ రూ.2,500 ఉండేది. మే 3 నుంచి మణిపూర్ లో ఉద్రిక్తతలు మొదలవడంతో వలసపోయే వారి సంఖ్య భారీగా పెరిగింది.
డిమాండ్ పెరగడంతో విమానయాన సంస్థలు రేట్లు పెంచాయి. ఇండిగో (Indigo), ఎయిర్ ఏషియాతో (Air Asia) సహా మిగతా అన్ని సంస్థలు టికెట్ ధరలు పెంచాయి. ఆ టికెట్ ధరలను ఏకంగా రూ.12 వేల నుంచి రూ.25,000 కు పెంచేశారు. అడ్డూఅదుపు లేకుండా మానవత్వం మరచి ధరలు పెంచడంతో ప్రయాణికులు షాక్ కు గురవుతున్నారు. ఇంఫాల్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున వెళ్తున్నారు.