ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఆస్పత్రి పాలయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెరుగైన చికిత్స కోసం దవాఖానాలో చేరారు. కొంతకాలం క్రితం కరోనా పాజిటివ్ సోకి చికిత్స పొందారు. ఆ తర్వాత నిమోనియా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో లలిత్ మోడీ ఆక్సిజన్ సపోర్ట్ తో చికిత్స తీసుకుంటున్నారు. వారంలో తనకు రెండుసార్లు కరోనా వచ్చిందని.. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నానని ఇన్ స్టా గ్రామ్ ద్వారా చెప్పారు.
కొవిడ్, ఇన్ ఫ్లూయెంజా, నిమోనియాతో బాధపడుతున్నానని పోస్ట్ చేశారు. ఇద్దరు డాక్టర్లు, కొడుకు సాయంతో విమానంలో హాస్పిటల్ కి వెళ్లారు లలిత్ మోడీ. దురదృష్టవ శాత్తు 24 గంటలు ఆక్సిజన్ సహాయంతో ఉండాల్సి వస్తోందన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మూడు వారాల తర్వాత మెక్సికో నుంచి లండన్ కు చేరుకున్నట్టు ఆయన వెల్లడించారు.