»Jodhapur Two Children Died After The Goods Train Fell Down After Being Chased By Dog
Jodhapur : చిన్నారుల వెంటపడ్డ కుక్కలు.. గూడ్స్ రైలు కిందపడి ఇద్దరూ మృతి
ఇటీవల వీధికుక్కల దాడిలో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. జోధాపూర్లో కుక్కలు వెంటాడడంతో ఇద్దరు చిన్నారులు గూడ్స్ రైలు కింద పడ్డారు.
Jodhapur : ఇటీవల వీధికుక్కల దాడిలో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. జోధాపూర్లో కుక్కలు వెంటాడడంతో ఇద్దరు చిన్నారులు గూడ్స్ రైలు కింద పడ్డారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఇక్కడి జోధాపూర్లోని బనార్ ప్రాంతంలో తమను వెంబడిస్తున్న కుక్కల నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తిన ఇద్దరు పాఠశాల విద్యార్థులు గూడ్స్ రైలు ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
కుక్కలు ఇద్దరు చిన్నారులను తరమగా వారు రైల్వే ట్రాక్ ఎక్కారు. ఈ సమయంలో ఒక అబ్బాయి, అమ్మాయిని గూడ్స్ రైలు ఢీకొట్టింది. బనాద్ కాంట్ రైల్వే స్టేషన్‌కు కొన్ని మీటర్ల దూరంలో నలిగి చనిపోయిందని పోలీసులు తెలిపారు.. కుక్క యజమానికి వ్యతిరేకంగా ఇరుగుపొరుగు వారితో కలిసి నిరసన ప్రారంభించి, డాగ్ స్క్వాడ్ ద్వారా పెంపుడు జంతువులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు పిల్లల కుటుంబ సభ్యులు మృతదేహాలను స్వీకరించడానికి నిరాకరించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు బృందం జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (సౌత్) డాగ్ స్క్వాడ్‌ను పిలిపించింది. డాగ్ స్క్వాడ్ పెంపుడు జంతువులను స్వాధీనం చేసుకోవడంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను అందుకున్నారు.. చనిపోయిన చిన్నారులు అనన్య కన్వర్ (9), యువరాజ్ సింగ్ (11) బనార్ ప్రాంతంలోని గణేష్పురాలో నివాసం ఉండేవారని, ఆర్మీ చిల్డ్రన్స్ అకాడమీలో 5, 7వ తరగతి చదువుతున్నారని పోలీసులు తెలిపారు.