SRD: ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండాపూర్ గ్రామంలో అంతర్ జిల్లా క్రికెట్ పోటీలు మంగళవారం నిర్వహించారు. సంగారెడ్డి బ్లూ జట్టు 45 ఓవర్లలో 321 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తరువాత సిద్దిపేట పింక్ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. 87 పరుగుల తేడాతో సంగారెడ్డి బ్లూ జట్టు విజయం సాధించింది.