Babu Mohan : క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ.పాల్ ‘ప్రజా శాంతి’ అనే రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి మనకు తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి తన పార్టీకి కనీసం 10,000 ఓట్లను సాధించడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో పోటీకి కూడా అదే ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నిసార్లు ఓడిపోయినా ఊహల్లో విహరిస్తూ తెలంగాణకు తామే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. త్వరలో జరగనున్న తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయనుంది. అయితే ప్రముఖ హాస్యనటుడు, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ఈరోజు ప్రజాశాంతి పార్టీలో చేరారు.
ఈరోజు ఆయన కేఏ పాల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బాబూ మోహన్ వ రంగ ల్ సీటు నుంచి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. 1998లో తెలుగుదేశం పార్టీలో చేరి అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ప్రజాశాంతి లాంటి పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.