»Ktr No One Should Pay Electricity Bill This Month
KTR: ఎవరూ ఈ నెల కరెంటు బిల్లు కట్టొద్దు!
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా కరెంట్ బిల్లులు కట్టొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
KTR: ఈ నెల నుంచి ప్రజలెవరూ కరెంట్ బిల్లు కట్టొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దని తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. కాబట్టి ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలని తెలిపారు. కరెంట్ బిల్లులు అడిగిగే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలని కేటీఆర్ తెలిపారు. కరెంట్ బిల్లు సోనియా గాంధీ కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తెలిపారు.
KTR asks people Not to pay current bill of January until Griha Jyothi scheme is implemented
Send current bills to 10Janpath to Sonia Gandhi’s house in Delhi
Every meter in #Hyderabad shud get free current under Griha Jyothi, Even to tenants
ఇప్పుడు మీరు కరెంట్ బిల్లులను కట్టకుండా సోనియా గాంధీ ఇంటికి, 10 జన్‌పథ్‌కు పంపించండని కేటీఆర్ తెలిపారు. నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని అన్నారు. గృహజ్యోతి పథకాన్ని వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు రూ.2500 వెంటనే ఇవ్వాలన్నారు. ఇచ్చిన హామీలను తప్పించుకోవాలని చూస్తే కాంగ్రెస్‌ను వదిలిపెట్టే పరిస్థితి లేదన్నారు.