SKLM: సారవకోట మండలం మదనాపురం పంచాయితీ మాజీ సర్పంచ్ కోనారి సింహాచలం ఖరీఫ్ సీజన్లో వ్యవసాయానికి సంబంధించి గడ్డి నివారణ మందు ఉచితంగా పంపిణీ చేశారు. ఉదయం స్థానిక గ్రామంలో సన్న కారు రైతులకు నామిని గోల్డ్ గడ్డి నివారణ నిమిత్తం వీటిని అందజేశామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నాట్లు వేసిన 20రోజుల తర్వాత ప్రతి ఏడాది రైతులను ఆదుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.