TPT: SVUలో జూలై 6వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పోస్టర్ను ఆవిష్కరించారు. MRF కంపెనీ ప్రతినిధులు హాజరవుతారని కోఆర్డినేటర్ వివేక్ తెలిపారు. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు జూలై 6వ తేది ఉదయం 9 గంటలకు ప్రకాశం భవనానికి రావాలని సూచించారు.