SRD: విద్యార్థులు కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ పరిధిలోని జేఎన్టీయూ కళాశాలలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న పథకాల గురించి వివరించారు.