JGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా SC, ST, BC, మైనారిటీ పేద విద్యార్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్‌లో ఉచిత శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, ఎస్సీ స్టడీ సర్కిల్ జిల్లా శాఖ డైరెక్టర్ జి. నరేష్ పాల్గొన్నారు.