NLR: సంగం చెక్ పోస్ట్ సెంటర్ సమీపంలో ఉన్న హౌసింగ్లే అవుట్‌ను బుధవారం హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ ఏఈతో చర్చించారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నందున లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు రావాలన్నారు. లబ్ధిదారులు ముందుకొచ్చి తమ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు.