CTR: పూతలపట్టు మండలంలోని పి. కొత్తకోట సమీపంలో ఉన్న కూల్ బీచ్ జ్యూస్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని బుధవారం ఎమ్మెల్యే సందర్శించారు. మామిడి కొనుగోలు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ చర్యలను పరిశీలించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం క్రమపద్ధతిలో రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేయాలని సూచించారు. సబ్సిడీ లాంటి ప్రభుత్వ సాయం అందుబాటులో ఉంటుందని రైతులకు హామీ ఇచ్చారు.