ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం అమావాస్య సందర్భంగా స్వామి వారికి భక్తులు విశేష పూజలు చేశారు. వేకువజామున స్వామి వారికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో స్వామివారి ఉత్సవమూర్తికి హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.