భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12:01 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 వ్యోమనౌక ద్వారా ఆయన బృందం ISSకు వెళ్లనుంది. దీంతో వ్యోమనౌకలోకి వెళ్లేముందు శుభాంశు శుక్లా.. హృతిక్ రోషన్ ‘ఫైటర్’ మూవీలోని ‘వందేమాతరం’ పాటను విన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను స్పేస్ ఎక్స్ విడుదల చేసింది.