»Ayodhya Ram Mandhir The Structure Of Ram Mandhir Is Enough To Hold On To The Goti
Goldsmith Kapilavai Gopichari: గోటిపై పట్టేంత రామమందిర నిర్మాణం
బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కడ విన్నా అయోధ్య రామందిర అంశమే వినిపిస్తుంది. అయితే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని శ్రద్ధలను చాటుకుంటున్నారు.
Goldsmith Kapilavai Gopichari: అయోధ్య రాములోరి ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడింది. ఎక్కడ చూసిన భక్తులు రామనామ స్మరణలో మునిగిపోయారు. బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. ఏ నోట విన్నా రామనామమే వినిపిస్తుంది. అయితే రాములోరి ప్రారంభోత్సవ నేపథ్యంలో ఎవరికి తోచిన విధంగా వారు భక్తిని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ భక్తుడు బంగారు రామమందిరాన్ని రూపొందించాడు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపిచారి.
ప్రముఖ సూక్ష్మ కళాకారుడు స్వర్ణకారుడు గోపిచారి గోటిపై పట్టెంత అయోధ్య రామమందిరాన్ని రూపొందిచాడు. 1.5 సెంమీ ఎత్తు, 1.75 సెంమీ వెడల్పు స్తంబాలు, 2.75 సెంమీ పొడవుతో భవ్య రామమందిర ఆలయాన్ని 2.730 మిల్లి గ్రాముల బంగారంతో, మూడు అంతస్తుగా రూపొందించాడు. గోపి చారి రూపొందించిన గోరంత రామ మందిరంలో 20గోపురాలు, 108స్థంబాలు, ప్రత్యేకంగా విల్లును తయారు చేసి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అంతే కాకుండా ఇంత చిన్న మందిరంలో శ్రీరాముని విగ్రహాన్ని సైతం పొందుపరిచి ఔర అనిపించాడు. సుమారు 21రోజుల పాటు శ్రమించి భవ్యరామమందిరాన్ని గోరంత సూక్ష్మంగా రూపొందించి తన కళానైపుణ్యంతో ప్రతిభను చాటాడు.