Hyderabad : హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార ముఠా గుట్టురట్టైంది. ఓ కాంగ్రెస్ నాయకుడు ఎస్ఎస్ఏ సెలూన్ ముసుగులో నీచమైన పని చేస్తున్నాడు. కస్టమర్లను ప్రలోభపెట్టి ఉద్యోగుల ముసుగులో మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇటీవలి కాలంలో స్పా, థెరపీ, సెలూన్ సెంటర్లలో ఎక్కువగా ఇలాంటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సమాచారం మేరకు పోలీసులు దాడి చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దాడిలో యువతులు, మహిళలను పట్టుకున్నారు . నేడు హైదరాబాదులో ఇలాంటి రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. స్పాలు, సెలూన్ల ముసుగులోనే కాకుండా లాడ్జీల్లోనూ వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సౌత్ జోన్ ట్యాంక్ ఫోర్స్ అధికారులు గురువారం అబిడ్స్ లోని ఫర్ట్యూన్ హోటల్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు చేయగా వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణమైన రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తనతో పాటు.. 16 మంది యువతులు,నలుగురు కస్టమర్స్, ఇద్దరు ఆర్గనైజర్లతో పాటు లాడ్జి యజమానిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కోల్కతా, ముంబైకి చెందిన మహిళలుగా గుర్తించారు. విచారణ నిమిత్తం అబిడ్స్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
అలాగే మియాపూర్ లో స్పా సెంటర్ సీవైబీ ఏహెచ్ టీయూపై దాడి చేసి నలుగురు పురుషులు, ఏడుగురు మహిళలను పట్టుకున్నారు. కొందరి వ్యక్తిగత ఇబ్బందులు కారణంగా మహిళల్ని ఈ నరక కూపంలో పడి బలవుతున్నారు. కుటుంబ భారాన్ని తమ నెత్తిమీద వేసుకుని ఆలోచన లేకుండా వ్యభిచార కూపంలోకి దిగిపోతున్నారు. మరికొంత మంది ట్రాప్ చేయబడో, లేక ఇతర కారణాలతో వ్యభిచారంలో నెట్టివేయబడుతున్నారు.