»Kanipakam Is The Bank Officer Who Stole The Gold In The Hundi Counting
Kanipakam: కాణిపాకం హుండి లెక్కింపులో బ్యాంకు అధికారి చేతివాటం
కాణిపాకం హుండీ లెక్కింపులో స్థానిక బ్యాంకు అధికారి తన తెలివిని ప్రదర్శించాడు. ఓ బంగారు బిస్కెట్ను తన సంచిలో వేసుకున్నాడు. గమనించిన ఆలయ ఈవో ప్రశ్నించగా బుకాయించాడు. ఆ తరువాత ఏమైందంటే..
Kanipakam is the bank officer who stole the gold in the hundi counting
Kanipakam: ఆలయాల్లో హుండీ లెక్కింపు కార్యక్రమాలు ఎంత పకడ్బందిగా చేస్తారో తెలిసిందే. అధికారుల మధ్య సీసీ కెమెరాల మధ్య చాలా నిజాయితీగా చేస్తారు. అప్పుడప్పుడు కొందరు తమ దుర్భుద్దిని ప్రదర్శిస్తారు. అలాంటి ఘటనే కాణిపాకం ఆలయంలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం గురించి తెలిసిందే. ఎంతో ప్రసిద్ది చెందిన ఈ ఆలయంలో స్వయంగా వెలిసిన గణనాథుడిని దర్శించుకోవాడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. కానుకలు విరివిగా సమర్పిస్తారు. హుండీలో వేసిన కానుకలను లెక్కించడం ఆనవాయితీగా జరుగుతుంది. తాజాగా జరిగిన హుండీల లెక్కింపులో బ్యాంకు అప్రైజర్ చేతివాటం ప్రదర్శించాడు.
రోజుకు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కానుకలు సమర్పిస్తారు. అందులో ధనం, బంగారం, వెండి తదితర కానుకలు ఉంటాయి. వాటిని ఆలయ ఆస్థాన మండపంలో గురువారం లెక్కించారు. ఈ లెక్కింపుకు స్థానిక బ్యాంకుకు చెందిన అప్రైజర్ ప్రకాశ్ హాజరయ్యారు. కుప్పగా పోసిన కానుకల్లోంచి 100 గ్రాముల బంగారు బిస్కెట్ను తన సంచిలో వేసుకున్నాడు. విషయాన్ని గమనించిన ఆలయ ఈవో ప్రశ్నించగా బ్యాంకు అధికారి దబాయించాడు. దాంతో సీసీ కెమెరాలను పరిశీలించి చోరీని గుర్తించారు. తరువాత ఆ బంగారు బిస్కెట్ను తీసుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ప్రకాశ్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.