తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్తగా 27 రకాల బీర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ పాటికే అనుమతులు ఇచ్చినట్లు త్వరలోనే ఆ బ్రాండ్లు మద్యం దుఖాణాల్లో అందుబాటులో ఉంటాయని తెలుస్తుంది.
New Bears: తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 27 రకాల బీర్లను తీసుకురాబోతున్నట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దీనికోసం కొత్తగా ఐదు బీర్లు తయారు చేసే కంపెనీలతో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా వాటికి అనుమతులు మంజూరు చేసింది. వీటిలో క్రాఫ్ట్ బీర్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ కొత్తగా అనుమతులు ఇచ్చిన కంపెనీల్లో టాయిట్ బ్రేవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్సోటికా లిక్కర్ ప్రైవేట్ లిమిటెడ్, మౌంట్ ఎవరెస్ట్ లిమిటెడ్, లీలాసన్స్ ఆల్కా బేవ్ ప్రైవేట్ లిమిటెడ్, సోం డిస్టిలరీస్ అండ్ బేవరేజెస్ ఉన్నాయి. వీటిలో లీలాసన్స్ ఆల్కా బేవ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంగారెడ్డి జిల్లాలోని మల్లేపల్లిలో ఉంది. ఇదే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ‘ట్రెడిషనల్ ఎక్స్లెన్స్ ఇన్ క్వాలిటీ’ అనే కంపెనీ పేరుతో బీర్లు విక్రయిస్తోంది. అలాగే చెన్నైలో కూడా సెయింట్ పాట్రిక్స్’ పేరుతో మద్యం బీర్లు తయారు చేస్తుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించి లీలాసన్స్ ఆల్కా బేవ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ‘అమెరికన్ బ్రూవ్ క్రాఫ్ట్ లిమిటెడ్ (ప్రై)’తో టైఅప్ అయినట్లు సమాచారం. ఈ కంపెనీ ‘బ్లాక్ బస్టర్’ పేరుతో నాలుగు ఫ్లేవర్లలో బీర్లను తయారు చేస్తోంది. అయితే తెలంగాణలో కేవలం రెండు బ్రాండ్లను మాత్రమే అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే ఈ బ్లాక్ బస్టర్ తెలంగాణలో మన్నిక ఉన్న విషయం తెలిసిందే. ఈ కంపెనీతో పాటు ఎక్సోటికా లిక్కర్ ప్రై. లి. కంపెనీ సైతం సంగారెడ్డి జిల్లా మల్లేపల్లిలో బీర్లను తయారు చేస్తున్నట్లు దరఖాస్తు చేసుకుంది. ఎండతాపకు బీర్లు దొరకలేదని ఎన్నో కథనాలు వచ్చాయి. రాష్ట్రంలో బీర్ల కొరతను తగ్గించేందుకే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.