కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central Govt Employees), పింఛన్దారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. త్వరలోనే వీరికి 4 శాతం మేర కరువు భత్యాన్నిపెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మూలవేతనంలో డీఏ ప్రస్తుతం డీఏ (DA) 42 శాతం నుంచి 46 శాతానికి చేరనుంది. ముఖ్యమైన పండుగల ముందు ఉద్యోగులకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు డెర్ నెస్ అలవెన్స్ (కరువు భత్యం/డీఏ)ను 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పింఛను దారులకు డేర్ నెస్ రిలీఫ్ (DR) ను 4 శాతం పెంచింది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ (Central Cabinet) నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తాజాగా ఆమోదించిన డీఏ 2023 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. నిజానికి మూడు నెలలకు పైగా డీఏ పెంపు అపరిష్కృతంగా ఉంది.
కీలకమైన పండుగల ముందు దీనిపై నిర్ణయం తీసుకుని ఉద్యోగుల(employees)కు ఊరట కల్పించినట్టయింది. ప్రభుత్వ నిర్ణయంతో 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.నవంబర్ నెల వేతనాలతో కలిపి పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికి రానుంది. జూలై నుంచి అక్టోబర్ వరకు బకాయిలు కూడా చెల్లించనున్నారు. బేసిక్ వేతనం (Basic pay) రూ.18,000 వేతనం ఉన్న వారికి 42 శాతం డీఏ కింద రూ.7,560 వస్తుంది. దీన్ని 46 శాతానికి పెంచడంతో ఇకపై రూ.8,280 రానుంది. మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ప్రతీ ఆరు నెలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీఏని ప్రకటిస్తుంటాయి.