సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విస్తరణ పనుల్లో బిజీగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేశారు. ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటకలో జేడీఎస్‌తో మైత్రి ఉండనే ఉంది. ఒడిశాపై కేసీఆర్ దృష్టిసారించారు. ఇటీవల మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, తన కుమారుడు శిశిర్ గమాంత్‌తో కలిసి కేసీఆర్‌ను కలిశారు. ఈ రోజు వారిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో చేరతారని తెలిసింది. వీరితోపాటు ఒడిశా కోరాపుట్ మాజీ ఎంపీ జయరాం పాంగి, ఇతరలు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారు.
ఒడిశా బీఆర్ఎస్ చీఫ్ పదవీని గిరిధర్ గమాంగ్‌కు కేసీఆర్ అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్‌కు పొసగడం లేదు. బీఆర్ఎస్ ఆవిర్భావం కన్నా ముందు నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒడిశాలో తన పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు. గిరిధర్ గమాంగ్‌కు ఒడిశా బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేసీఆర్‌తో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. వివిధ రాష్ట్రాలు సీఎంలు, మాజీ సీఎంలు, జాతీయ సంఘాల నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు, మేధావులు ఆసక్తి చూపిస్తున్నారు.
గిరిధర్ గమాంగ్ తొమ్మిది సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1999 ఏప్రిల్ 17న జరిగిన అవిశ్వాస పరీక్షలో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎంపీ పదవీకి రాజీనామా చేయకుండానే ఒడిశా సీఎంగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనను పక్కన పెట్టేసింది. ఆయన కుమారుడు శిశిర్ బీజేపీలో చేరారు.. యాక్టివ్‌గా లేరు. ఈ క్రమంలో బీఆర్ఎస్లో చేరబోతున్నారు.