అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయిబాబా ఆలయంలో జరిగిన 26వ వార్షిక మహోత్సవ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు డా. మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనను ఆలయ ధర్మకర్తలు దుశ్యాలవ, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.