22 MLAs, 9 MPs unhappy with BJP, want to leave Eknath Shinde's Shiv Sena: Saamana
Shinde Shiv Sena: ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలో గల శివసేన పార్టీలో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారట. ఈ విషయాన్ని ఉద్దవ్ శివసేన మౌత్ పీస్ ‘సామ్నా’ (Saamana) తన సంపాదకీయంలో రాసింది. 22 మంది ఎమ్మెల్యేలు (22 mla), 9 మంది ఎంపీలు (9 mps) సంతోషంగా లేరని పేర్కొంది. సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde), బీజేపీ (bjp) సంకీర్ణ ప్రభుత్వం పట్ల హ్యాపీగా లేరని.. పార్టీ వదలి వెళ్లాలని అనుకుంటున్నారని రాసింది.
నియోజకవర్గాల్లో ఆశించిన మేర అభివృద్ధి జరగడం లేదట. అందుకే పార్టీని వీడాలని అనుకుంటున్నారని ఉద్దవ్ థాకరే శివసేన ఎంపీ వినాయక్ రౌత్ (vinayak) పేర్కొన్నారు. బీజేపీ తీరుపై శివసేన నేత గజానన్ కీర్తికర్ బహిరంగంగా అసంతృప్తికి వ్యక్తం చేశారని సామ్నా (Saamana) తెలిపింది. ప్రభుత్వంలో బీజేపీ విపక్ష చూపతుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారట. 13 మంది ఎంపీలు (13 mps) ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ తమ నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని సొంత పార్టీ నేతలు అంటున్నారట.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 22 చోట్ల పోటీ చేస్తామని షిండే శివసేన నేత కీర్తికర్ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి బీజేపీ (bjp)- శివసేన షిండే (shivasena-shinde) పార్టీ మధ్య చర్చ జరిగిందా అని సామ్నా (Saamana) సందేహాం వ్యక్తం చేసింది. వారు 22 చోట్ల పోటీ అంటున్నారు.. కానీ షిండే (shinde) వర్గానికి ఏడు సీట్లు కూడా ఇవ్వడానికి బీజేపీ సిద్దంగా లేదని వివరించింది.