»Lineman Cuts Power To Police Station Due To His Bike Get Traffic Challan
Lineman : పోలీస్ స్టేషన్‌కు పవర్ కట్, కారణమిదే..?
ఓ లైన్ మెన్‌కు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ఫైన్ వేశారు. దీంతో ఆ లైన్ మెన్ పోలీసు స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ హపూర్‌లో జరిగింది.
Lineman Cuts Power To Police Station Due To His Bike Get Traffic Challan
Lineman Cuts Power PS: రూల్స్ అంటే రూల్సే.. బైక్ నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలి. ఉత్తరప్రదేశ్(uttar pradesh) హపూర్‌లో ఓ లైన్ మెన్ (Lineman) మాత్రం హెల్మెట్ పెట్టుకోలేదు. అలా రోజు వెళ్తుండటంతో చివరికీ పోలీసులు (police) ట్రాఫిక్ చలాన్ (Traffic Challan) విధించారు. రూ.వెయ్యి ఫైన్ కట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు (police) ఆ లైన్ మెన్ కక్షగట్టారు.
మీరట్‌లో గల ధిర్ఖేడాకు చెందిన ఖలీద్ హపూర్‌లో లైన్మెన్గా (Lineman) పనిచేస్తున్నాడు. ధిర్ ఖేడా నుంచి హపూర్‌కు వస్తుంటాడు. హెల్మెట్ (helmet) మాత్రం పెట్టుకోకపోవడంతో రూ. వెయ్యి ఫైన్ వేశారు. చలానా చెల్లించాలని కోరగా.. తాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్లో పనిచేస్తున్నానని చెప్పాడు. పోలీసులు (police) వినిపించుకోలేదు.. అందరికీ ఒకటే రూల్స్ అని.. కట్టాల్సిందేనని చెప్పారు. తనకే చలాన్ (Challan) వేస్తారా అని లైన్ మెన్ కక్ష తీర్చుకున్నాడు. ఆ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ (power) సరఫరా నిలిపివేశాడు. స్టేషన్ లైన్ పవర్ కట్ చేశాడు. మిగతా చోట్ల పవర్ ఉండి.. అక్కడ లేకపోవడంతో వారు ఆశ్చర్యపోయారు. ఎలక్ట్రిసిటీ విభాగానికి ఫోన్ చేయగా అసలు విషయం తెలిసింది. ఉన్నతాధికారులు ఏం జరిగిందని ఆరా తీయగా.. లైన్ మెన్ (Lineman) పవర్ కట్ చేశారని తెలిసింది.
అలా చేయడం తప్పు అని.. విద్యుత్ సప్లై (Power supply) చేయాలని కోరగా చివరకు పోలీసు స్టేషన్‌కు పవర్ ఇచ్చారు. సో.. ఓ లైన్ మెన్ చేసిన పనితో పీఎస్‌కు విద్యుత్ నిలిచిపోయింది. నిబంధనలు అతిక్రమించడంతోనే అతనికి చలానా విధించామని.. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని పోలీసులు అంటున్నారు. కానీ లైన్ మెన్ మాత్రం పర్సనల్‌గా తీసుకుని, విద్యుత్ నిలిపివేశాడు.