»Chhattisgarh Officer Faces Paycut After Dam Water Drained For Mobile
Chhattisgarh Officer నుంచి డబ్బులు వసూల్.. నీటి తోడిన ఘటనపై చర్యలు
రిజర్వాయర్ నుంచి నీరు తోడిన ఘటనలో ఛత్తీస్ గఢ్ ఫుడ్ ఆఫీసర్ రాజేశ్ విశ్వాస్ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆ నీటికి విలువ కట్టి, రాజేశ్ నుంచి డబ్బులు వసూల్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇంద్రావతి ప్రాజెక్ట్ ఎస్ఈ.. జలవనరుల శాఖ అధికారికి లేఖ రాశారు.
Chhattisgarh Officer Faces Paycut After Dam Water Drained For Mobile
Chhattisgarh Officer Faces Paycut: ఛత్తీస్ గఢ్ ఫుడ్ ఆఫీసర్పై (Chhattisgarh Officer) అధికారులు చర్యలు ప్రారంభించారు. నీటి తోడివేతకు సంబంధించి ఇప్పటికే సస్పెండ్ చేయగా.. తాజాగా ఆ నీటికి విలువ కట్టి సదరు అధికారి జీతం నుంచి కట్ చేస్తారట. దీనికి సంబంధించి ఇంద్రావతి ప్రాజెక్ట్ (Indravathi Project) సూపరింటెండెంట్ ఇంజినీర్, జలవనరుల శాఖ ఎస్డీవో రాంలాల్ ధివర్కు లేఖ రాశారు. దీంతో అతని జీతం నుంచి నీటి తోడిన డబ్బులు వసూల్ చేయడం పక్కా అని తేలిపోయింది.
రిజర్వాయర్లో ఉన్న నీరు వ్యవసాయం, వేసవిలో ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ప్రజల అవసరాలకు వినియోగించే నీటిని వృథా చేశారని.. దానికి విలువ కట్టి, ఎందుకు డబ్బులు వసూల్ చేయకూడదని ఎస్ఈ (SE) ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఫోన్ (Mobile) బయటకు తీసేందుకు కొంత మేర నీళ్లు తోడేందుకు అనుమతి ఇచ్చామని.. ఎక్కువ ఖాళీ చేశారని జలవనరుల విభాగం అధికారి ఇంతకుముందే వివరణ ఇచ్చారు. దానిపై ఎస్ఈ సంతృప్తి చెందలేదు. సదరు అధికారి నుంచి ఖాతా నుంచి డబ్బులు వసూల్ చేయాల్సిందేనని స్పష్టంచేశారు.
కాంకేర్ జిల్లాలో రాజేశ్ విశ్వాస్ (Rajesh vishwas) ఫుడ్ ఆఫీసర్గా పనిచేస్తారు. ఖేర్ కట్టా డ్యామ్ వద్దకు వచ్చిన సమయంలో సెల్ఫీ (Selfi) తీసుకునే సమయంలో ఫోన్ ఓవర్ ఫ్లో ట్యాంక్ నీటిలో పడింది. ఆ ఫోన్ ఖరీదు రూ. లక్ష కాగా.. అందులో అధికార సమాచారం ఉందని తెలిపారు. ఈతగాళ్లు దిగినపట్పికీ ఆ ఫోన్ (Mobile) దొరకలేదు. జలవనరుల విభాగం అధికారికి తెలుపగా.. అతను రెండు భారీ మోటార్లలో (motors) నీళ్లను ఖాళీ చేయించారు. 3 రోజుల్లో 21 లక్షల లీటర్ల నీటిని బయటకు తీడేశారు. ఆ నీటితో 1500 ఎకరాల సాగునీటి అవసరాలు తీరతాయి. వేసవిలో నీటి ఎద్దడి ఉంది. జనం నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు.
విషయం తెలిసి సదరు అధికారిపై విమర్శలు వచ్చాయి. దీంతో రాజేశ్ విశ్వాస్ను (vishwas) సస్పెన్షన్ వేశారు. ఇప్పుడు ఎస్ఈ (SE).. ఆ నీటి తోడేందుకు అనుమతి ఇచ్చిన అధికారికి లేఖ రాశారు. సదరు అధికారి జీతం నుంచి నీటి తోడివేతకు సంబంధించి నగదు వసూల్ చేయడం కన్ఫామ్ అని తేలిపోయింది. ఫోన్ (Mobile) బయటకు తీశారు.. కానీ 3 రోజులు నీటిలో ఉండటంతో మొబైల్ పనిచేయడం లేదు. ఆ ఫోన్ కోసం భారీగా నీటిని వృథా చేశారు.