»Congress Will Win 150 Seats Rahul Gandhi On Upcoming Madhya Pradesh Polls
Rahul Gandhi: మధ్యప్రదేశ్ లోనూ 150 సీట్లు గెలుస్తాం
కర్ణాటకలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్ లో మంచి హుషారు వచ్చింది. ఇదే హుషారుతో ఇతర రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలని అనుకుంటోంది. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ(Rahul Gandhi) చెప్పారు. మధ్యప్రదేశ్ లో ఇదే సత్తా చాటాలని తాము అనుకుంటున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు గెలుచుకుంటుందని రాహుల్ గాంధీ(Rahul Gandhi )ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం నాడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ సైతం పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన గెలుపు మధ్యప్రదేశ్‌లోనూ పునరావృతమవుతుందని చెప్పారు.
”ఈరోజు సమావేశంలో పార్టీ కీలక నేతలందరితో ఎన్నికలపై సమగ్రంగా చర్చించాం. కర్ణాటకలో 136 సీట్లు సాధించాం. పార్టీ అంతర్గత సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లో 150 సీట్లు గెలుచుకోబోతున్నాం. కర్ణాటకలో ఏమైతే చేశామో మధ్యప్రదేశ్‌లోనూ దానిని పునరావృతం చేస్తాం” అని మీడియాకు రాహుల్(rahul) తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్ర అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పాల్గొన్నారు. 2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్దపార్టీగా అవతరించింది. బీజేపీ 109 సీట్లు గెలుచుకుంది. అయితే 2020లో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.