Dhoni Gets Emotional While Hugging Ravindra Jadeja After Win IPL Final
Dhoni Gets Emotional: వరణుడు దోబుచులాడగా.. ఎట్టకేలకు నిన్న ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ తీసుకుంది. గుజరాత్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి.. 214 పరుగులు చేశారు. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు మళ్లీ వర్షం అడ్డంకిగా మారింది. ఆ తర్వాత వర్షం తగ్గినప్పటికీ పిచ్ తయారు చేయడానికి చాలా సమయం పట్టింది. 15 ఓవర్లకు మ్యాచ్ కుదించి..171 పరుగుల లక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన చెన్నై బ్యాట్స్‌మెన్ విజయం దిశగా నడిచారు. కానీ మోహిత్ శర్మ (Mohith sharma), మహ్మద్ షమీ (shami) లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో చివరి బాల్ వరకు ఉత్కంఠ రేగింది.
చివరి రెండు బాల్స్‌లో 10 పరుగులు చేయాల్సి ఉండే.. మొదటి బంతిని రవీంద్ర జడేజా (jadeja) సిక్స్ కొట్టాడు. చివరి బంతిని ఫోర్‌గా మలిచి చెన్నై విజయాన్ని అందించాడు. అప్పటివరకు చెన్నై బ్యాట్స్ మెన్, అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఓ అభిమాని అయితే ఎడ్చినంత పనిచేసింది. ధోని (Dhoni) అయితే.. చివరి రెండు బాల్స్ చూడలేదు. కిందకి మొహం పెట్టుకొని కనిపించారు. తమ జట్టు విజయం సాధించిందని తెలిసి.. ధోని (Dhoni) సహా జట్టు సంబరాలు చేసుకుంది.
జట్టును విజయతీరాలకు చేర్చిన రవీంద్ర జడేజాను ధోని (Dhoni) హగ్ చేసుకున్నాడు. జడ్డుతో ధోనికి (Dhoni) అనుబంధం ఉంది. జడేజాను.. సర్ రవీంద్ర జడేజా అని పిలిచేవారు. తన మిత్రుడిలా భావించేవారు. అతను జట్టును గెలిపించడంతో.. ధోని (Dhoni) భావొద్వేగానికి గురయ్యారు. ఆ ఆనందంతో కంటి నుంచి వచ్చింది. అక్కడున్న మీడియా ప్రతినిధులు ఫోటోలు తీయగా.. ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఆ పిక్ తెగ వైరల్ అవుతుంది.
ధోని (Dhoni) చాలా ఎమోషనల్ అయ్యారని ఓ ఫ్యాన్ ట్వీట్ చేశారు. మిగతా అభిమానులు కూడా రియాక్ట్ అయ్యారు. 40 ఏళ్ల వయస్సులో కూడా ధోని.. ఐపీఎల్ ఆడుతున్నారు. అతని రిటైర్మెంట్ గురించి ఎప్పుడూ అడిగిన.. నవ్వుతూ ఉంటారు. సమాధానం మాత్రం ఇవ్వడం లేదు.