ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘పుష్ప 2’. డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ మొత్తం రూ.1065 కోట్లు జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం థియేట్రికల్ రైట్స్ బిజినెస్ రూ.640 కోట్లు జరగ్గా.. మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.425 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.