TG: బాచుపల్లి నారాయణ జూనియర్ కాలేజీ స్టాఫ్ మొత్తాన్ని మార్చాలంటూ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇదే కాలేజీని కొన్ని రోజుల ముందే తనిఖీ చేశాను. అప్పుడు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పాను. అయినా యాజమాన్యం పట్టించుకోలేదు.. అనూష ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ప్రతి ఇన్స్టిట్యూట్ను నేను తనిఖీలు చేస్తాను. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది’ అని పేర్కొన్నారు.