VSP: విశాఖ వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ దంపతులు సింహాద్రి అప్పన్న స్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు. వీరికి సహాయకార్య నిర్వహణాధికారి రమణమూర్తి, ప్రోటోకాల్ ఏఈవో రాంబాబు, ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు స్వాగతం పలికారు. ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగన చేసుకుని బేడామండప ప్రదక్షణ అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.