HNK: భవన నిర్మాణాల కోసం నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తేనే అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ లు, భవన నిర్మాణాల అనుమతుల కోసం పలువురు దరఖాస్తు చేసిన నేపథ్యంలో వాటికి అనుమతుల మంజూరు కోసం కమిషనర్ మంగళవారం నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు.