టీమిండియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. తన సేవలు అవసరమని భావిస్తే ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటానని చెప్పాడు. ‘ఆట పరంగా సీరియస్‌గా ఉంటా. ఈ సిరీస్‌కి అవసరమైతే ముందుగా దేశవాళీ టోర్నీలో ఆడేందుకు కూడా సిద్దంగా ఉన్నా. సరైన కారణాల వల్లే ఆటకు వీడ్కోలు పలికాను. కానీ జట్టు తరుపున ఆడేందుకు ముందుంటా. ఈ విషయంలో సిగ్గుపడను’ అని పేర్కొన్నాడు.