TG: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల అవస్థలపై హరీశ్ రావు తన ‘X’ ఖాతాలో పోస్టు చేశారు. సరిపడా బస్సులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ప్రమాదకరంగా బస్సులకు వేలాడుతూ ప్రయణిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బస్సుల సంఖ్య పెంచాలని కోరారు.