TG: యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం విధించినట్లు ఈవో తెలిపారు. ఇటీవల యాదగిరిగుట్టపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు రీల్స్ చేశారు. దీంతో ఆలయ ప్రతిష్టను భంగం కలిగేలా ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించినట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగి జ్ఞాపకంగా భద్రపర్చుకుంటే అభ్యతరం లేదని తెలిపారు. ఇక నుంచి కొండపైన భక్తులు తీసే ఫొటోలు, వీడియోలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు.