AKP: నర్సీపట్నం న్యాయమూర్తి పి.షియాజ్ ఖాన్ మంగళవారం సాయంత్రం స్థానిక సబ్ జైలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన ఖైదీలతో మాట్లాడుతూ.. ఖైదీలు ఎవరైనా న్యాయవాదిని పెట్టుకొని స్తోమత లేని వారి ఉంటే వెంటనే తమను సంప్రదించాలని సూచించారు. జైలు నుంచి విడుదల తర్వాత ఖైదీల ప్రవర్తనలో మార్పు రావాలని కోరారు.