భారత్‌లో అమెరికాకు చెందిన జీప్ కంపెనీ తన మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ కారును లాంచ్ చేసింది. రూ. 24.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగా కాకుండా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్ కలిగి 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. కొత్త మెరిడియన్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈనెల ఆఖరి వారంలో ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది.