NRML: బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో బాల్య వివాహాలు, అక్రమ రవాణా తదితర వాటిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.