ELR: ఏలూరు ప్రభుత్వ డీఎల్ టీసీ, ఐటీఐ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు 254 మంది హాజరయ్యారని ఇంఛార్జ్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వాడపల్లి కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాలో 98 మందిని అర్హులుగా గుర్తించి, వివిధ కంపెనీలలో ఉపాధి కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్.ఉగాది రావు పాల్గొన్నారు.