తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికల్లా తుపానుగా మారనుంది. దీంతో భారత వాతావరణశాఖ ‘దానా’ తుపానుగా నామకరణం చేసింది. ఈ తుపాను ప్రభావం వల్ల ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, తుపాను ప్రభావంతో రైల్వేశాఖ ఈనెల 23, 24, 25 తేదీల్లో భారీగా రైళ్లను రద్దుచేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఎం కే సందీప్ ప్రకటించారు. ఈనెల 23న 18 రైళ్లు, 24న 37 రైళ్లు, 25న 11 రైళ్లు రద్దు చేశారు.