ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జలాశయానికి 1,53,418 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం 884.30 అడుగుల నీరు నిల్వ ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు రెండు గేట్లను ఎత్తి 1,21,990 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.