’12 ఫెయిల్’ వంటి సూపర్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన విధు వినోద్ చోప్రా తనయుడు అగ్ని చోప్రా రంజీల్లో అదరగొడుతున్నాడు. మిజోరం తరుపున ఆడుతున్న అగ్ని చోప్రా.. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన టెస్టులో సెంచరీ, డబుల్ సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు దేశవాళీ క్రికెట్లో ఇలాంటి రికార్డు ఎవరూ నమోదు చేయలేదు. కాగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 6 మ్యాచ్లు ఆడి 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు.