VZM: యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఎస్సై రామ గణేష్ వెల్లడించారు. నెల్లిమర్ల మండలం సారిపల్లిలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో గంజాయి రవాణా, వినియోగించిన సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. గ్రామంలో స్పందన గోడ పత్రికలను అతికించారు.