ఐసీసీ ఛైర్మన్గా బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి అతడు ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ఐసీసీ ఛైర్మన్ పదవి మూడు విడతల్లో ఆరేళ్ల పాటు ఉండేది. కాగా దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ బోర్డు సభ్యుల సమావేశంలో ఆ విధానంలో స్వల్ప మార్పులు చేశారు. దీంతో జై షా రెండు విడతల్లోనే ఆరేళ్లపాటు ఐసీసీ ఛైర్మన్ పదవిలో కొనసాగనున్నాడు.