బెంగళూరులోని నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో హెన్నూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది.ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. నలుగురిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద మరో 13 మంది కార్మికులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనా ప్రాంతంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి.