ASR: జిల్లాలో పెద్దఎత్తున వయోజన అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహించి అక్షరాస్యతా సంఖ్యను పెంచాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ఐసీడీఏస్, వయోజన విద్య, విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న నైట్ వాచ్మెన్, వంటవారు, హెల్పర్లకు క్రియాత్మక అక్షరాస్యతలను నేర్పించాలని అన్నారు.