ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో రాయదుర్గంలోని రూ.వేల కోట్ల విలువైన 84 ఎకరాల సర్కారు భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు. దీనిపై 2003లో అప్పటి ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో.. అవి నకిలీ పత్రాలేనని కోర్టు తేల్చింది. దీంతో శివరామకృష్ణతోపాటు ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్లో పనిచేసే చంద్రశేఖర్, మరొకరిని అరెస్టు చేశారు.