JGL: కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని పలు గ్రామాలలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు. కనీసం ఈ కొనుగోలు కేంద్రాలైన రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.