వక్స్ చట్ట సవరణపై ఏర్పాటైన జేపీసీ సమావేశంలో గందరగోళం నెలకొంది. బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో టేబుల్‌పై ఉన్న గాజు గ్లాసును కళ్యాణ్ బెనర్జీ పగులగొట్టగా..ఆయన చేతి వేళ్లకు గాయాలయ్యాయి. దీంతో గొడవకు కారణమైన అతడిపై వేటు పడింది. తదుపరి సమావేశానికి రాకుండా ఛైర్మన్ జగదాంబిక పాల్ ఆయనను సస్పెండ్ చేశారు.