VZM: పెందుర్తి నుంచి శృంగవరపుకోట మీదుగా బౌడారా వరుకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 956.21 కోట్లు మంజూరు చేసిందని ఎంపీ శ్రీ భరత్ మంగళవారం తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా రహదారిని నాలుగు లైన్లగా విస్తరిస్తామని చెప్పామని, భారతమాల పరియోజన పథకం కింద నిధులు విడుదలయ్యాయన్నారు. రహదారి నిర్మాణంతో ప్రయాణం సులభతరం అవుతుందన్నారు.